విశాఖ నగర పాలక సంస్థ కాంట్రాక్ట్, అవుట్సోర్సింగ్ కార్మికులను పర్మినెంట్ చేయాలని కోరుతూ... మద్దిపాలెంలో పారిశుద్ధ్య కార్మికులు నిరసన చేపట్టారు.
మద్దిపాలెంలో పారిశుద్ధ్య కార్మికుల నిరసన - మద్దిపాలెంలో పారిశుద్ధ్య కార్మికుల నిరసన
విశాఖ నగర పాలక సంస్థ కాంట్రాక్ట్, అవుట్సోర్సింగ్ కార్మికులను పర్మినెంట్ చేయాలని కోరుతూ... మద్దిపాలెంలో జీవీఎంసీ పర్మినెంట్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ నిరసన చేపట్టింది. పర్మినెంట్ కార్మికులకు ఆరోగ్య కార్డులు అందజేయాలని డిమాండ్ చేశారు.

మద్దిపాలెంలో పారిశుద్ధ్య కార్మికుల నిరసన
ఎంటీఎస్ కార్మికులను పర్మినెంట్ చేయాలని, 11వ వేతన సంఘం వేతనాలను చెల్లించాలని సీఐటీయూ నగర కార్యవర్గ సభ్యుడు కుమార్ డిమాండ్ చేశారు. సచివాలయ కార్యదర్శుల పెత్తనాన్ని నిలిపివేయాలని కోరారు. పారిశుద్ధ్య కార్మికులకు రక్షణ పరికరాలు సరఫరా చేయాలని, పనికి తగ్గ వేతనం చెల్లించాలని కోరారు. పర్మినెంట్ కార్మికులకు ఆరోగ్య కార్డులు సరఫరా చేసి... ఇంజనీరింగ్ కార్మికులకు స్కిల్, సెమీ స్కిల్డ్ వేతనాలు చెల్లించాలని కోరారు.
ఇదీ చదవండి:ఐదు నెలలుగా అందని వేతనాలు.. పారిశుద్ధ్య కార్మికుల ఇబ్బందులు