ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జీవీఎంసీ పాలకవర్గం తీర్మానం - విశాఖ వార్తలు

విశాఖ జీవీఎంసీ తొలి పాలకవర్గ సమావేశం జరిగింది. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా తీర్మానం ప్రవేశపెట్టి ఆమోదించారు. తెదేపా ఎంపీలు రాజీనామా చేయాలంటూ తెదేపా, జనసేన నాయకులు డిమాండ్​ చేశారు.

gvmc meeting
విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జీవీఎంసీ పాలకవర్గం తీర్మానం

By

Published : Apr 9, 2021, 3:10 PM IST

విశాఖ జీవీఎంసీ మేయర్ గొలగాని హరి వెంకట కుమారి అధ్యక్షతన తొలి కౌన్సిల్ సమావేశం జరిగింది. 9 ఏళ్ల విరామం తరువాత నేడు సమావేశం జరిగింది. 10 ప్రధాన, 33 సప్లిమెంటరీ అంశాల అజెండాగా సమావేశం నిర్వహించారు. సంతాప తీర్మానం తరువాత స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా తీర్మానం ప్రవేశపెట్టారు.

స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ప్రవేశపట్టిన తీర్మానాన్ని చర్చ అనంతరం నగరపాలక సంస్థ పాలకవర్గం ఆమోదించింది. ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ ప్రవేశపెట్టిన తీర్మానాన్ని ఆమోదించాలంటూ.. విపక్షాలు డిమాండ్ చేశాయి. అసెంబ్లీలో ప్రత్యేక తీర్మానం చేయాలని తెదేపా డిమాండ్ చేసింది.

విజయసాయిరెడ్డితో పాటు విశాఖ జిల్లా వైకాపా ఎంపీలు రాజీనామా చేయాలని తెలుగుదేశం, జనసేన కార్పొరేటర్లు డిమాండ్‌ చేశారు. తాము కేంద్రంపై వివిధ మార్గాల్లో ఒత్తిడి తెస్తూనే ఉన్నామని వైకాపా ఎంపీ సత్యనారాయణ బదులిచ్చారు.

ఇదీ చదవండి:

'ఆ నిర్ణయం వల్ల మేము రోడ్డు మీద పడతాం'

ABOUT THE AUTHOR

...view details