విశాఖ గూడెంకొత్తవీధి మండలం సీలేరు గిరిజన గురుకుల పాఠశాలలో ఏడవ తరగతి చదువుతున్న తామెర్ల సాయి అనే విద్యార్థి మృతి చెందాడు.బాలుడికి అనారోగ్యంతో మూర్చ రావడంతో పాఠశాల సిబ్బంది సీలేరు ఆసుపత్రికి తరలించారు.అయితే విద్యార్థి పరిస్థితి విషమంగా ఉందని,వెంటనే చింతపల్లి తీసుకెళ్లాలని సీలేరు వైద్యాధికారి సూచించగా,ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలోనే బాలుడు మృతిచెందాడు.విద్యార్థి మృతిచెందిన విషయం పాఠశాల సిబ్బంది తల్లిదండ్రులకు తెలుపగా,వారు చింతపల్లికి చేరుకున్నారు.తమ కుమారుని అనారోగ్యం గురించి ఎవరికి ఎటువంటి సమాచారం ఇవ్వలేదని,పాఠశాల సిబ్బంది నిర్లక్ష్యం వల్ల తమ కుమారుడు మృతి చెండాదని తల్లిదండ్రులు నూకరాజు,నాగమ్మలు ఆరోపిస్తున్నారు.
అనారోగ్యంతో మృతిచెందిన గురుకుల పాఠశాల విద్యార్థి
విశాఖపట్నం జిల్లాలోని ఓ గిరిజన గురుకుల పాఠశాలలో ఏడవ తరగతి చదువుతున్న విద్యార్థికి మూర్చరోగం వచ్చింది. ఆసుపత్రికి తరలించేలోపే బాలుడు మృతి చెందడంతో, పాఠశాల సిబ్బంది నిర్లక్ష్యంతోనే తమ కుమారుడు మృతి చెండాదని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.
అనారోగ్యంతో విశాఖలోని గిరిజన గురుకుల పాఠశాల విద్యార్థి మృతి