విశాఖ ఏజెన్సీ కేంద్రం పాడేరు ఐటీడీఏలో ప్రతి శుక్రవారం గిరిజనుల సమస్యలపై సమావేశం నిర్వహిస్తుంటారు. ప్రతి వారం మాదిరిగానే అనేకమంది గిరిజనులు తమ సమస్యల పరిష్కారం కోసం ఐటీడీఏకు తరలివచ్చారు. అయితే కరోనా వైరస్ నేపథ్యంలో అధికారులెవరూ సమావేశానికి రాలేదు. సమావేశం మందిరం బయట గ్రీవెన్స్ పెట్టెను ఉంచారు. ఈ విషయం తెలియక గిరిజనులు ఐటీడీఏ చుట్టూ ప్రదక్షిణలు చేశారు. సమాచారం తెలుకుకున్న పలువురు వినతులను ఫిర్యాదు పెట్టెలో వేసి వెళ్లారు.
కరోనా ఎఫెక్ట్: పాడేరులో నిలిచిన గ్రీవెన్స్ సమావేశం - paderu itda office closed due to corona effect
విశాఖ మన్యానికి కేంద్రమైన పాడేరు ఐటీడీఏలో గ్రీవెన్స్ సమావేశానికి కరోనా దెబ్బ తగిలింది. సమావేశానికి అధికారులెవరూ రాలేదు.
పాడేరులో అధికారులు లేక ఆగిపోయిన గ్రీవెన్స్ సమావేశం