సివిల్స్‌లో విజయం సాధించేందుకు తన తల్లిదండ్రులు ఎంతో సహకరించారని విశాఖపట్నం జిల్లా నర్సీపట్నం సబ్ కలెక్టర్ నారపరెడ్డి మౌర్య అన్నారు. పట్టణంలోని బాలయోగి గురుకుల బాలికల రెసిడెన్షియల్ పాఠశాలలో పీఆర్టీయూ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలు అన్ని రంగాల్లో పురోగతి సాధించాల్సిన అవసరం ఉందని సబ్ కలెక్టర్ మౌర్య పిలుపునిచ్చారు. అనంతరం సబ్ కలెక్టర్ మౌర్యతో పాటు, నర్సీపట్నం తహశీల్దార్‌ను పీఆర్టీయూ నాయకులు సన్మానించారు.
'మహిళలు అన్ని రంగాల్లో పురోగతి సాధించాలి' - vizag district latest news
అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా విశాఖపట్నం జిల్లా నర్సీపట్నం సబ్ కలెక్టర్ మౌర్యను పీఆర్టీయూ నాయకులు సన్మానించారు. మహిళలు అన్ని రంగాల్లో పురోగతి సాధించాలని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు.
విశాఖపట్నం జిల్లా నర్సీపట్నం సబ్ కలెక్టర్ మౌర్య