'ప్రభుత్వం ఇచ్చిన విత్తనాలు.. మొలకెత్తలేదు' - formers
ప్రభుత్వం ఇచ్చిన రాయితీ విత్తనాలు మొలకెత్తలేదు...విత్తనాలు వేసి 20 రోజులు గడిచినా మొలకలు రాలేదు. విశాఖ జిల్లా కొవ్వూరు నారుమళ్లలో విత్తనాలు వేసిన రైతులు బోరుమంటున్నారు. ఒకటి కాదు.. రెండు కాదు ఏకంగా 200 ఎకరాల్లో మొలకలు రాలేదని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
విశాఖ జిల్లా రోలుగుంట మండలం కొవ్వూరులో ప్రభుత్వం ఇచ్చిన రాయితీ విత్తనాల్లో నకిలీ విత్తనాలున్నాయని రైతులు ఆరోపిస్తున్నారు. నారుమళ్లలో విత్తనాలు వేసి 20 రోజులు అయినప్పటికీ మొలకలు రాలేదని, నకిలీ విత్తనాలు కావడం వల్లే ఇలా జరిగిందని అంటున్నారు. కొవ్వూరుకు చెందిన సుమారు 25 మంది రైతులు... రోలుగుంటలో ప్రభుత్వ రాయితీ విత్తనాలు కొనుగోలు చేశారు. 2 వందల ఎకరాల్లో నారుమళ్లు సిద్ధం చేసి... సోనామసూరి రకానికి చెందిన విత్తనాలు వేశారు. ఎంతకూ మొలకలు రాకపోవడంతో అన్నదాతలు లబోదిబోమంటున్నారు. రాయితీ విత్తనాల్లో నకిలీలున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.