ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించాలి' - government should address the problems of teachers

ప్రభుత్వ ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించాలని ఉత్తరాంధ్ర ఉపాధ్యాయుల ఎమ్మెల్సీ పి.రఘువర్మ డిమాండ్​ చేశారు. విశాఖ జిల్లా చోడవరంలో పర్యటించిన ఆయన అనంతరం ఎమ్మార్సీ భవనంలో ఉపాధ్యాయుల సమస్యలపై చర్చించారు. తమ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించాలని ఏపీటీఎఫ్ మండల శాఖ ఆధ్వర్యంలో టీచర్స్ ఆయన్ను కోరారు.

government should address the problems of teachers
ఉపాధ్యాయుల సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలి

By

Published : Jun 4, 2020, 1:28 PM IST

ఉత్తరాంధ్ర ఉపాధ్యాయుల ఎమ్మెల్సీ పి.రఘువర్మ విశాఖ జిల్లా చోడవరంలో పర్యటించిన అనంతరం ఎమ్మార్సీ భవనంలో ఉపాధ్యాయుల సమస్యలపై చర్చించారు. ఏపీటీఎఫ్ మండల శాఖ ఆధ్వర్యంలో టీచర్స్ ఆయన్ను కలిసి తమ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని విజ్ఞప్తి చేశారు.

కరోనాను దృష్టిలో పెట్టుకుని జూలై నెలలో నిర్వహించే పదవ తరగతి పరీక్షల ఇన్విజిలేషన్స్​కు 50 ఏళ్లు పైబడిన ఉపాధ్యాయులకు మినహాయింపు ఇవ్వాలని కోరారు. పాఠశాలలు తెరిచేలోపు ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతులు చేపట్టాలన్నారు. సీపీఎస్ రద్దు చేయాలన్నారు. మిగిలిన సగం వేతనాలు కూడా వచ్చేలా కృషి చేయాలని కోరారు.

ఈ చర్చలో ఏపీటీఎఫ్ మండల శాఖ అధ్యక్షుడు జి.శ్రీనివాసు, ప్రధాన కార్యదర్శి మోసూరి మహాలక్ష్మి నాయుడు ఎల్.కొండలరావు, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి: ఎల్‌జీ పాలిమర్స్ వ్యవహారంపై హైకోర్టులో విచారణ వాయిదా

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details