మద్యం దుకాణాలు నిర్వహిస్తున్న వారిపై విశాఖ జిల్లా పాయకరావుపేట ఎక్సైజ్ పోలీసులు ఆకస్మిక దాడులు నిర్వహించారు. అక్రమంగా అమ్ముతున్న మద్యం సీసాలను స్వాధీనం చేసుకుని, ఐదుగురు వ్యక్తులపై కేసు నమోదుచేసి కోర్టుకు తరలించారు. పాయకరావుపేట ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని నక్కపల్లి, పాయకరావుపేట మండలాల్లో అక్రమంగా మద్యం అమ్మితే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని పాయకరావుపేట సీఐ హెచ్చరించారు. గ్రామాల్లో తయారీ అమ్మకాలు కొనసాగిస్తే సంబంధిత వ్యక్తులపై పీడీ కేసులు పెడతామన్నారు. లైసెన్స్ దుకాణదారులు గొలుసు దుకాణాలు నిర్వహించవద్దని సూచించారు. గ్రామాల్లో నిర్వహిస్తున్నట్లు సమాచారం ఉంటే తమకు ఫోన్ ద్వారా వివరాలు తెలియజేయాలన్నారు.
అక్రమంగా మద్యం అమ్మితే కఠిన చర్యలు - visakha
సారాయి తయారు చేసి ఆమ్మకాలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని విశాఖ జిల్లా పాయకరావుపేట ఎక్సైజ్ సీఐ శ్రీనివాసరావు తెలిపారు.
మద్యం