ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

విశాఖ విమానాశ్రయంలో రూ.45 లక్షల విలువైన బంగారం పట్టివేత - బంగారం పట్టివేత

దుబాయ్ నుంచి బంగారాన్ని అక్రమంగా తరలిస్తున్న నలుగురు వ్యక్తులను విశాఖ విమానాశ్రయ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి సుమారు రూ. 45 లక్షల విలువ గల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు.

విశాఖ ఎయిర్​ పోర్టులో రూ.45 లక్షల విలువ గల బంగారం పట్టివేత

By

Published : Jun 21, 2019, 6:52 AM IST


దుబాయ్ నుంచి అక్రమంగా తరలిస్తున్న బంగారాన్ని విశాఖ విమానాశ్రయంలో పట్టుకున్నారు. ఎటువంటి పన్ను చెల్లించకుండా సుమారు 1294 గ్రాముల బంగారాన్ని దుబాయ్​ నుంచి తీసుకువస్తున్న నలుగురు వ్యక్తుల్ని కస్టమ్స్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. దుబాయ్ నుంచి హైదరాబాద్ మీదుగా ఎయిర్ ఇండియా ఫ్లైట్​లో ఈ నలుగురు విశాఖ చేరుకున్నారు. అధికారుల తనిఖీల్లో బంగారం తరిస్తున్నట్లు తెలుసుకున్న పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. వారిలో ముగ్గురు బంగారం తరిలిస్తున్నట్లు ఒప్పుకున్నారని కస్టమ్స్ ప్రిన్సిపల్ కమిషనర్ డి.కె. శ్రీనివాసన్ తెలిపారు. బంగారం స్వాధీనం చేసుకుని నిందితులను విచారిస్తున్నట్లు చెప్పారు.

విశాఖ విమానాశ్రయంలో రూ.45 లక్షల విలువైన బంగారం పట్టివేత

ABOUT THE AUTHOR

...view details