ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పెట్టుబడుల పండుగకు ముస్తాబైన సాగర తీరం.. ‘ఎడ్వాంటేజ్‌ ఏపీ’ నినాదంతో

GLOBAL INVESTORS SUMMIT AT VISAKHA: 'గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్‌'కు సాగరతీరం ముస్తాబైంది. ఈ నెల 3, 4 తేదీల్లో జరగనున్న సదస్సుకు వేదిక‌ల‌ను ఏర్పాటు చేశారు. సహజ వనరులు, అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలంటూ కీలక రంగాల్లో పెట్టుబడులు ఆకర్షించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. సమ్మిట్‌లో 26 దేశాలు పాల్గొనున్నాయి. అతిథులు, పెట్టుబడిదారుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఏపీ ప్రత్యేక పెవిలియన్ సిద్ధమవుతోంది.

GLOBAL INVESTORS SUMMIT AT VISAKHA
GLOBAL INVESTORS SUMMIT AT VISAKHA

By

Published : Mar 2, 2023, 8:57 AM IST

పెట్టుబడుల పండుగకు విశాఖ సిద్ధం.. ‘ఎడ్వాంటేజ్‌ ఏపీ..’ నినాదంతో సమ్మిట్‌

GLOBAL INVESTORS SUMMIT AT VISAKHA : 'ఎడ్వాంటేజ్ ఏపీ' అనే నినాదంతో పెట్టుబడులు ఆకర్షించేందుకు ప్రభుత్వం.. రంగం సిద్ధం చేసింది. విశాఖలో ఈ నెల 3, 4 తేదీల్లో జరగబోయే గ్లోబల్ ఇన్వెస్టర్ల సదస్సుకు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు. ఆంధ్ర విశ్వవిద్యాలయం ఇంజినీరింగ్ కళాశాల మైదానంలో మూడు ప్రధానమైన వేదికలను నెలకొల్పారు. సమ్మిట్ లోగోగా.. 'నోటితో డాలర్ పట్టుకున్న రామచిలుక'ను రూపొందించారు.

సదస్సులో మొత్తం 15 రంగాల్లో ఒప్పందాలు కుదుర్చుకునేలా ప్రభుత్వం ప్రణాళికలు రచించింది. సదస్సులో 26 దేశాలు పాల్గోనున్నాయి. 8వేల మంది అతిథులు, పెట్టుబడిదారులు రానున్నారు. 137 ఏపీ పెవిలియన్ స్టాల్లు ఏర్పాటుకానున్నాయి. 4 వేల మంది అతిథుల‌కు స‌రిప‌డేలా డైనింగ్ ఏరియా సిద్ధం చేశారు. పారిశ్రామికవేత్తలు, ప్రముఖుల భద్రతకు ప్రత్యేక చర్యలు చేపట్టారు. సీఎం జగన్ ఈరోజు సాయంత్రానికి విశాఖ చేరుకొని కార్యక్రమాలను నేరుగా సమీక్షిస్తారు.

వేర్వేరుగా రూపొందించిన వేదికల వద్ద చర్చలు, ఒప్పందాలు జరుగుతాయి. స్థానిక పెట్టుబ‌డుదారులు రిజిస్ట్రేష‌న్ చేసుకునేందుకు వీలుగా 40 డెస్కుల‌ను ఏర్పాటు చేశారు. గ్లోబల్ సమ్మిట్ ద్వారా రాష్ట్రానికి ఆదాయాన్నిచ్చే పెట్టుబడులు వస్తాయని మంత్రి అమర్నాథ్ అన్నారు. యువతకు ఉపాధి అవకాశాలు పెరిగేలా కంపెనీలతో ఒప్పందం చేసుకుంటామని తెలిపారు.

సమ్మిట్‌కు వచ్చే ప్రతినిధులు ఎక్కువగా పర్యాటక రంగంలో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపుతున్నారు. హోటళ్లు, రెస్టారెంట్‌లు, రిసార్టుల నిర్మాణానికి పెట్టుబడిదారులు మొగ్గుచూపుతున్నట్లు తెలుస్తోంది. హ్యాండ్‌లూమ్స్ - టెక్స్‌టైల్స్‌, ఐటీ, ఎల‌క్ట్రానిక్స్‌, ఫార్మా, హెల్త్‌, లాజిస్టిక్స్, అగ్రిక‌ల్చర్, ఎరువులు, పెట్రోలియం ఉత్పత్తుల‌కు సంబంధించిన స్టాళ్లు ఏర్పాటు చేయ‌నున్నారు.

అద‌నంగా రాష్ట్ర ప్రభుత్వం త‌ర‌ఫున ప్రత్యేకంగా మారిటైం ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌, పోర్టు ఇండ‌స్ట్రీస్‌, గ్రామ స‌చివాల‌యాలు, పాఠ‌శాల విద్య‌, ప‌ట్టణ ప్రణాళికకు సంబంధించిన అంశాలు ప్రదర్శన‌లో ఉంటాయి.

సదస్సులోని కార్యక్రమాల వివరాలు..

మార్చి 3 : శుక్రవారం ఉదయం 9.15 గంటలకు సీఎం జగన్‌ అధ్యక్షత GIS ప్రారంభోత్సవం ఉంటుంది. ఆ తరువాత నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు పారిశ్రామికవేత్తలు, విదేశీ ప్రతినిధులను ఆహ్వానిస్తారు. మధ్యాహ్నం 3 గంటలకు ఎగ్జిబిషన్‌ ప్రారంభోత్సవం. మొత్తం 9 రంగాలపై చర్చలుండే అవకాశం.

* మధ్యాహ్నం 3.00-3.50 గంటల మధ్య పరిశ్రమలు, ఐటీ, లాజిస్టిక్స్‌, రెన్యువబుల్‌ ఎనర్జీ, గ్రీన్‌ హైడ్రోజన్‌ అంశాలపై చర్చ. నెదర్లాండ్‌ ప్రతినిధులతో సమావేశం.

*సాయంత్రం 4-4.50 మధ్య ఎలక్ట్రానిక్‌ మొబిలిటీ, ఆటో, అంకుర ప్రతిభ, హెల్త్‌కేర్‌, మెడికల్‌ ఎక్యూప్‌మెంట్‌ అంశాలపై చర్చ. యూఏఈ ప్రతినిధులతో సమావేశం.

* 5.00- 5.50 మధ్య వ్యవసాయం, ఎలక్ట్రానిక్స్‌, రక్షణ, ఆహారశుద్ధి, ఏరోస్పేస్‌తోపాటు, ఆహార వ్యవస్థలో మారుతున్న పరిణామాలపై ప్రత్యేక సెషన్‌.

మార్చి 4:ఎంవోయూలు: రెండో రోజు 6 రంగాలపై చర్చలుంటాయి. 4న ఉదయం 9.30-10.30 మధ్య పెట్టుబడులు, ఒప్పందాలు జరుగుతాయి. మరో వైపు సెమినార్‌ హాల్స్‌లో సమావేశాలుంటాయి.

* శనివారం ఉదయం 9.00-9.45 గంటల మధ్య పెట్రోకెమికల్స్‌, పెట్రోలియం, ఉన్నత విద్య, పర్యాటకం, ఆసుపత్రులపై చర్చ.

* ఉదయం 9.45-10.30 మధ్య టెక్స్‌టైల్స్‌, నైపుణ్య శిక్షణ, ఫార్మాస్యూటికల్స్‌, వెస్ట్రన్‌ ఆస్ట్రేలియా ప్రతినిధులతో సమావేశం.

* సీఎం ఆధ్వర్యంలో ఒప్పందాలు. అనంతరం ముగింపు సమావేశం.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details