'గెలుపు అడ్డుకోలేమని కుట్రలు' - ycp
తెదేపా విజయాన్ని అడ్డుకునేందుకు వైకాపా అడ్డదారులు తొక్కుతోందని మంత్రి గంటా శ్రీనివాసరావు విమర్శించారు. తెదేపా అనుకూల ఓట్లు తొలగించాలని తప్పుడు దరఖాస్తులు పెట్టారని ఆరోపించారు. తెదేపా భారీ ఆధిక్యంతో గెలుస్తుందనే విపక్షం అక్రమ మార్గాలు ఆశ్రయించిందని మండిపడ్డారు
తెదేపా విజయాన్ని అడ్డుకునేందుకు వైకాపా అడ్డదారులు తొక్కుతోందని మంత్రి గంటా శ్రీనివాసరావు విమర్శించారు. తెదేపా అనుకూల ఓట్లు తొలగించాలని తప్పుడు దరఖాస్తులు పెట్టారని ఆరోపించారు. ఇలా 74వేలకుపైగా దరఖాస్తులు వెళ్లాయని తెలిపారు. ఓట్ల తొలగింపులో అక్రమాలపై ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేశామనీ... మార్పులు చేర్పులపై పర్యవేక్షణ జరుగుతోందన్నారు. తొలగించిన ఓట్లు మళ్లీ జాబితాలో చేర్చాలని ఎన్నికల అధికారులను కోరతామని చెప్పారు. తెదేపా భారీ ఆధిక్యంతో గెలుస్తుందనే విపక్షం అక్రమ మార్గాలు ఆశ్రయించిందని మండిపడ్డారు. వైకాపా, తెరాస, భాజపా కుట్రలను రాష్ట్ర ప్రజలు తిప్పికొడతారన్నారు.