విశాఖ జిల్లా నర్సీపట్నం సమీపంలోని బలిఘట్టం వద్ద మహిళా పోలీసుల వాహన తనిఖీల్లో 690 కిలోల గంజాయిని పట్టుకున్నారు. దిల్లీకి చెందిన భారీ వాహనంలో గంజాయి రహస్య అరల్లో నింపి రవాణా చేస్తుండగా...ఉన్నతాధికారుల సమాచారం మేరకు పోలీసులు సోదాలు జరిపి అదుపులోకి తీసుకున్నారు. డ్రైవర్ సీటుకు వెనుక భాగంలో గంజాయిని లోడు చేసి తరలించే ప్రయత్నం చేశారు. పట్టుబడిన గంజాయి విలువ సుమారు కోటి రూపాయలు ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. దిల్లీకి చెందిన ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేసినట్టు పట్టణ సి.ఐ. లక్షణమూర్తి తెలిపారు.
నర్సీపట్నంలో కోటి విలువ చేసే గంజాయి పట్టివేత - బలిఘట్టం
పోలీసుల తనిఖీల్లో కోటి రూపాయల విలువ చేసే గంజాయి పట్టుబడిన సంఘటన విశాఖ జిల్లా నర్సీపట్నంలో చోటు చేసుకుంది.
నర్సీపట్నంలో కోటి రూపాయల విలువచేసే గంజాయి పట్టివేత