విశాఖపట్నం జిల్లా గొలుగొండ మండలంలోని ఏటి గైరంపేట కూడలి వద్ద.. 460 కిలోల గంజాయిని స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వాహనాలను తరలించే భారీ ట్రాలీ అడుగు భాగంలో గంజాయిని దాచి తరలిస్తున్నట్లు అధికారులు గుర్తించి పట్టుకున్నారు. పట్టుబడిన గంజాయి విలువ సుమారు రెండు కోట్లకు పైగా ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ ఘటనలో ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేశామని, మరొకరు పరారీలో ఉన్నారని అధికారులు తెలిపారు.
GANJA SMUGGLING : గంజాయి ఎలా తరలిస్తున్నారో తెలుసా? - ganja smuggling in vizag
అక్రమార్కులు తరలిస్తున్న గంజాయిని.. విశాఖ జిల్లా ఏటి గైరంపేట కూడలి వద్ద ఎస్ఈబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనలో ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేశారు.
వాహనాల అడుగుభాగంలో గంజాయి తరలింపు