ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

బ్యాంక్​ సిబ్బంది 'గోల్డ్​ లోన్​' మోసం..లబోదిబోమంటున్న ఖాతాదారులు - visakhapatnam

విశాఖ ఇండియన్​ బ్యాంకు ద్వారకా నగర్​ శాఖ అధికారులు గోల్డ్ లోన్ విషయంలో అవకతవకలకు పాల్పడ్డారని ఖాతాదారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

బ్యాంకు

By

Published : Aug 16, 2019, 10:08 PM IST

మా ప్రమేయం లేకుండా గోల్డ్ లోన్ పెట్టారు

తమ ప్రమేయం లేకుండా విశాఖలోని ద్వారకానగర్​ ఇండియన్ బ్యాంకు అధికారులు గోల్డ్ లోన్ పెట్టారని ఖాతాదారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. బ్యాంకు ఎకౌంట్ తమ పేరు మీద ఉన్నా లోన్​ తీసుకున్నారని.. ఇప్పుడు డబ్బులు కట్టమని వేధిస్తున్నారని వినియోగదారులు లబోదిబోమంటున్నారు. బ్యాంకు ఖాతా నిలిపివేయాలని పెట్టుకున్న అర్జీ మీద సుమారు 15 గోల్డ్ లోన్స్ తీసుకున్నారని.. అవి కూడా నకిలీ నగలు పెట్టారని.. ఇప్పడు డబ్బులు కట్టమంటున్నారని వాపోయారు. ఖాతాదారుల సంతకం లేకుండా బంగారంపై రుణాలు ఎలా ఇస్తారని నిలదీశారు. మరో ఖాతాదారు రెండు సార్లు గోల్డ్ లోన్ పెడితే ఏకంగా 15 సార్లు పెట్టుకున్నట్టు నోటీసులు జారీ చేశారు. అధికారులే నకిలీ నగలు తాకట్టుపెట్టి నగదు మాయం చేశారని.. ఇప్పుడు మోసాన్ని తమపై రుద్దే ప్రయత్నం చేస్తున్నారని ఖాతాదారులు వాపోయారు. పోలీసులు కేసు దర్యాప్తు చేయాలని వేడుకున్నారు. సుమారు 40 ఖాతాదారుల పేరుమీద 70 లక్షల మోసానికి బ్యాంకు అధికారులు పాల్పడ్డారని బాధితులు పేర్కొన్నారు.

ABOUT THE AUTHOR

...view details