'మెరుగైన వైద్యం ఉచితంగా అందించడమే ప్రభుత్వ లక్ష్యం' - విశాఖ జిల్లా తాజా వార్తలు
విశాఖ జిల్లా నర్సీపట్నంలోని ప్రాంతీయ ఆసుపత్రికి అదనపు గదుల నిర్మాణం కోసం స్థానిక ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ శంకుస్థాపన చేశారు. రూ.8 కోట్లు ఈ అభివృద్ధి పనికి కేటాయించారు. అందరికి నాణ్యమైన ఉచిత వైద్యం అందించడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు.

వైద్యం ఉచితంగా అందించడమే ప్రభ్యుత్వ లక్ష్యం
మెరుగైన వైద్యం ఉచితంగా అందించడానికి ప్రభుత్వం కృషి చేస్తోందని నర్సీపట్నం ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ పేర్కొన్నారు. స్థానిక ప్రాంతీయ ఆసుపత్రి వద్ద సుమారు రూ.8 కోట్లతో నిర్మించనున్న అదనపు భవనాల నిర్మాణానికి ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. మన్యం ప్రాంతాలతో పాటు ఇతరులకూ ఉచిత వైద్యం, ఆసుపత్రిలో మరిన్ని సేవలు విస్తృతం చేయడానికి సన్నాహాలు చేస్తున్నామన్నారు.
Last Updated : Nov 28, 2020, 11:47 AM IST