Venkaiah Naidu on Government Free Schemes: విశాఖలోని తగరపువలస గోస్తనీ నది సమీపంలోని అవంతి ఇంజనీరింగ్ కళాశాల స్నాతకోత్సవ వేడుకలకు.. మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ప్రభుత్వాలు సంపదను పెంచే ప్రయత్నాలు చేయాలి కానీ... ఉచితాలు ఇవ్వడం సరికాదని పేర్కొన్నారు. సంపదను ఉచితంగా ఇస్తే ప్రజలు అభివృద్ధిలోకి రాలేరన్నారు. మాతృభాష కనుచూపు లాంటిదని, విదేశీ భాష కళ్లద్దాల వంటిదని వర్ణించారు.
మాతృభాషలో విద్యనభ్యసించిన వారు దేశంలో అత్యున్నత పదవులను చేపట్టారని తెలియజేశారు. తనలాగే.. మాతృభాషలో విద్యనభ్యసించిన భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, సుప్రీంకోర్టు మాజీ ప్రధాని న్యాయమూర్తి ఎన్వీ రమణ, దేశ ప్రధాని నరేంద్ర మోదీ అత్యున్నత పదవులు చేపట్టినట్లు తెలిపారు. విద్యార్థులు క్రమశిక్షణ తో, కష్టపడే మనస్తత్వం కలిగి ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మాజీ రాజ్యసభ సభ్యులు యార్లగడ్డ లక్ష్మీ నారాయణ, అవంతి విద్యా సంస్థల చైర్మన్ ఎమ్మెల్యే ముత్తంశెట్టి శ్రీనివాసరావు, జేఎన్టీయూ కాకినాడ వైస్ ఛాన్స్‌లర్ జీవీఆర్ ప్రసాద్ రాజు హాజరయ్యారు.