ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'మంత్రి అవంతి​పై వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలి' - మాజీ ఎమ్మెల్యే మల్ల విజయప్రసాద్

వైకాపా మంత్రి అవంతి శ్రీనివాస్​ని ఓ మంత్రిగా చూడలేకపోతున్నానని ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు వ్యాఖ్యానించడంపై వైకాపా నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

Former MLA Malla Vijayaprasad at a press conference at the party office in vishaka

By

Published : Sep 4, 2019, 4:05 PM IST

'మంత్రి అవంతి​పై వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలి'

ప్రజాస్వామ్యంలో ఒక మంత్రిని గౌరవించాల్సిన బాధ్యత అందరిపైన ఉన్నప్పటికీ గంటా శ్రీనివాసరావు ఒక ఉన్నత హోదాలో ఉండి ఇలా మాట్లాడటం సమంజసం కాదని మాజీ ఎమ్మెల్యే మల్ల విజయప్రసాద్ అన్నారు. పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడిన మల్ల... గంటా శ్రీనివాసరావుపై విరుచుకుపడ్డారు. గంటా అధికారంలో ఉన్నప్పుడు ఆయన చేసిన అవినీతి కార్యక్రమాలు అందరికీ తెలుసని అలాంటి వ్యక్తి నిజాయితీపరుడైన ఒక మంత్రిపై లేనిపోని వ్యాఖ్యలు చేయడం మానుకోవాలని హితవు పలికారు. వెంటనే తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుని.. మళ్లీ ఇలాంటి వ్యాఖ్యలు చేయకుండా జాగ్రత్తగా ఉండాలని అన్నారు.

ABOUT THE AUTHOR

...view details