ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ప్రమాదకరస్థాయికి డుడుమ జలాశయం నీటి నిల్వ

ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలకు డుడుమ జలాశయం నీటి నిల్వలు ప్రమాదస్థాయి కి చేరుకున్నాయి. ఆంధ్ర ఒడిశా ఉమ్మడి నిర్వహణలో ఉన్న డుడుమ జలాశయం.. 2 వేల 590 అడుగుల నీటి సామర్థ్యం పూర్తి స్థాయికి చేరుకుంది.

By

Published : Jul 7, 2019, 8:14 PM IST

డుడుమ జలాశయం

డుడుమ జలాశయం

డుడుమ జలాశయం నీటి మట్టం ప్రమాదకర స్థాయికి చేరుకుంది. 8వ నెంబర్ గేట్ ఒక అడుగు మేర ఎత్తి 1000 క్యూసెక్క్ ల వరద నీటిని దిగువున గల బలిమెల జలాశయానికి విడుదల చేశారు. మాచకుండ్ జలవిద్యుత్ కేంద్రం పరిధిలో విద్యుత్ సరఫరా నిలిచిపోయిన కారణంగా.. ప్రధాన జలాశయాలు ఉన్న డుడుమ ,జోలపుట్ లకు విద్యుత్ లేక ఆపరేటర్ లు రాత్రంతా అంధకారం లో గడిపారు. విద్యుత్ సరఫరా పునరుద్ధరణ జరిగిన తరువాత జోలపుట్ జలాశయం నుండి నీటి విడుదలను నిలిపివేశారు. ప్రస్తుతం డుడుమ జలాశయం లో నీటి మట్టం 2588.8 అడుగులుగా ఉంది.

ABOUT THE AUTHOR

...view details