విశాఖపట్నం జిల్లాలోని నర్సీపట్నం మండలం పెద్దబొడ్డపల్లి వసతిగృహంలో విద్యార్థులు అస్వస్థత కు గురయ్యారు. కలుషితాహారం తినడంతో అనారోగ్యం పాలయ్యారు. అస్వస్థతకు గురైన 9 మందిని ప్రాంతీయ ఆసుపత్రికి తరలించారు. శాసనసభ సభ్యులు పేట్ల ఉమాశంకర్ గణేష్ వారిని పరామర్శించారు. మెరుగైన వైద్యసేవలు అందించాలంటూ వైద్యులను ఆదేశించారు. విద్యార్థులను పరామర్శించిన తెదేపా యువనాయకుడు చింతకాయల విజయ్.. ఆందోళన చెందవద్దని విద్యార్థులకు ధైర్యం చెప్పారు. వసతిగృహంలో ఆహారం కలుషితమవ్వడానికి గల కారణాలు అధికారుల దృష్టికి తీసుకెళ్తానన్నారు.
వసతి గృహంలో కలుషితాహారం.. విద్యార్థుల అస్వస్థత - నర్సీపట్నం
విశాఖపట్నంలోని వసతి గృహంలో కలుషిత ఆహారం తిని 9 మంది విద్యార్థులు అస్వస్థత చెందారు. బాధతులను ఆసపత్రికి తరలించారు. శాసనసభ్యులు వారిని పరామర్శించారు.
వసతిగృహంలో వికటించిన ఆహారం..విధ్యార్థుల అస్వస్థత....