వేసవి మెుదలవ్వటంతో ఆదిత్యుని తాపానికి ప్రజలు భయభ్రాంతులకు గురౌతుంటే.. పాడేరులో పొగమంచు కనువిందు చేస్తోంది. తెల్లవారుజాము నుంచి పొగమంచు దట్టంగా కమ్మేసి.. చలి వాతావరణం కనిపిస్తోంది. ప్రస్తుతం విశాఖలో పగలు గరిష్టంగా 32 డిగ్రీల నమోదౌతుండగా.. కనిష్ఠ ఉష్ణోగ్రత 20 డిగ్రీలుగా ఉంది. ఆ చల్లటి వాతావరణం పర్యాటకులు, స్థానికులకు ఊరటనిస్తోంది.
పాడేరులో మంచు అందాలు... - పాడేరు ప్రస్తుత వాతావరణం
రాష్ట్రం అంతటా భానుడు తాపానికి ప్రజలు బెంబేలెత్తుతుంటే.. విశాఖ జిల్లా పాడేరులో మంచు అందాలు పులకరింపజేస్తున్నాయి. కనుచూపు మేరలో రహదారులు కనుమరుగై.. పోగమంచు అలుముకుంది. మంచు బిందువులతో మెుక్కలు కనువిందు చేస్తున్నాయి.
పాడేరులో పొగమంచు