విశాఖపట్నం జిల్లాలో మాడుగుల నియోజకవర్గంలోని జలాశయాలకు వరద నీరు భారీగా చేరింది. గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు. విశాఖపట్నం జిల్లా దేవరాపల్లి మండలం రైవాడ జలాశయంలోకి ఎగువ ప్రాంతం నుంచి వరద రావడంతో... నీటిమట్టం 113.56 మీటర్లకు చేరింది. అప్రమత్తమైన జలవనరుల శాఖ అధికారులు రెండు గేట్ల ద్వారా 2,200 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. చీడికాడ మండలం కోనాం జలాశయం నుంచి 350 క్యూసెక్కులు, మాడుగుల మండలం పెద్దేరు జలాశయం నుంచి 1,658 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు.
మాడుగులలోని జలాశయాల నుంచి భారీగా నీటి విడుదల
ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు జలశయాలు జలకళను సంతరించుకున్నాయి. మాడుగుల నియోజకవర్గంలో జలాశయాల్లో వరదనీటిని దిగువకు విడుదల చేశారు.
Floodwater release downstream news in visakha