ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పెద్దేరు, రైవాడ జలాశయాలకు పోటెత్తిన వరద

ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు విశాఖ జిల్లాలోని జలాశయాలకు భారీగా వరద నీరు చేరుతుంది. పెద్దేరు, రైవాడ జలాశయాల నీటిమట్టం ప్రమాద స్థాయికి చేరుకుంది. జల వనరుల శాఖ అధికారులు అప్రమత్తమై గేట్లు ఎత్తి అదనపు వరద నీటిని నదుల్లోకి విడిచిపెట్టారు.

By

Published : Sep 22, 2020, 7:45 AM IST

flood to water projects at vishakapatnam
పెద్దేరు, రైవాడ జలాశయాల పోటెత్తిన వరద

విశాఖ జిల్లా మాడుగుల మండలం పెద్దేరు జలాశయంలోకి.. ఎగువన కురుస్తున్న వర్షాలతో భారీ స్థాయిలో వరద నీరు చేరుతోంది. ప్రస్తుతం ఎగువ నుంచి 1235 క్యూసెక్కుల నీరు వస్తోంది. అప్రమత్తమైన జల వనరుల శాఖ అధికారులు.. 2 గేట్లు ఎత్తి 1235 క్యూసెక్కుల వరద నీటిని నదిలోకి విడుదల చేస్తున్నారు.

దేవరాపల్లి మండలం రైవాడ జలాశయంలో వరద నీరు పోటెత్తింది. ఎగువన కురుస్తున్న వర్షాలకు జలాశయంలోకి 850 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోంది. నీటిమట్టం ప్రమాద స్థాయికి చేరుకుంది. అధికారులు గేటు ఎత్తి 300 క్యూసెక్కుల వరద నీటిని శారదా నదిలోకి విడిచిపెట్టారు. నదీ పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక జారీ చేశారు.

ABOUT THE AUTHOR

...view details