విశాఖ జిల్లా నాతవరం మండలం సుందర కోట పంచాయతీ శివారు అసనగిరిలో ఐదు పూరిళ్లు దగ్ధం అయ్యాయి. ఇళ్లు అన్నీ పూర్తిగా కాలిపోయిన కారణంగా.. 8 గిరిజన కుటుంబాలు నిరాశ్రయులయ్యారు. సుమారు రెండున్నర లక్షల వరకు ఆస్తి నష్టం జరిగిందని బాధితులు తెలిపారు.
ప్రమాద సమయంలో ఎవరూ లేకపోవడంతో ప్రాణాపాయం తప్పిందని అన్నారు. ప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు. నష్టపరిహారాన్ని రెవెన్యూ అధికారులు అంచనా వేశారు. బాధితులకు న్యాయం జరిగేలా చూస్తామని వారు హామీ ఇచ్చారు.