విశాఖ ఆంధ్ర విశ్వవిద్యాలయం ఫైన్ ఆర్ట్స్ విభాగం విద్యార్థుల చిత్ర కళా ప్రదర్శన ఆకట్టుకుంది. మైమరపించే అద్భుత చిత్రా రూపాలు, ఆలోచింపచేసే సందేశాత్మక కళాత్మక ఆలోచనలు చూపరులను కట్టిపడేశాయి. బీఎఫ్ఏ(బ్యాచిలర్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్), ఎమ్ఎఫ్ఏ (మాస్టర్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్) చివరి సంవత్సరం విద్యార్థులు 'గ్రాడ్యుయేషన్ షో- 2019' ఏర్పాటు చేశారు. 3 రోజుల పాటు సాగిన ఈ ప్రదర్శన చిత్ర కళా ప్రేమికులను ఎంతగానో ఆకట్టుకుంది. నిన్నటితో ముగిసింది.
అందాల లోకంలో ఆలోచింపజేసిన చిత్రాలు - bfa
కళాత్మక చిత్రాలు మనసును హత్తుకుంటాయి. అవి కాస్త.. సామాజిక స్పృహ ఉన్నవి అయితే ఎన్నో ఆలోచనల్ని రేకెత్తిస్తాయి. శిల్ప రమణీయత అయినా... రంగుల చిత్ర రాజాలయినా... కళాత్మక సృష్టికి నిదర్శనాలే. అటువంటి అద్భుతాలు అన్నీ ఒకచోట కొలువు దీరాయి. ఆంధ్ర విశ్వవిద్యాలయం విద్యార్థుల చిత్ర కళా నైపుణ్యాన్ని కళ్లకు కట్టాయి.
అందమైన చిత్రలోకం
అంతర్జాతీయ స్థాయిలో రాణించేందుకు కృషి
ఏయూలో ఫైన్ ఆర్ట్స్ కోర్సు చేయడం కళారంగంలో తమకు దక్కిన అద్భుత అవకాశంగా విద్యార్థులు చెబుతున్నారు. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించడమే లక్ష్యంగా విద్యార్థులు భవిష్యత్తులో రాణిస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నారు.