ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

విశాఖలో వైకాపా నాయకుల మధ్య ఘర్షణ

విశాఖ పశ్చిమ నియోకవర్గ వైకాపా నేతలు పీవీ సురేష్, మాజీ డెప్యూటీ మేయర్ దాడి సత్యనారాయణ మధ్య వాగ్వాదం.. రసాభాసకు దారితీసింది. ‘జగనన్న తోడు’ ప్రారంభ కార్యక్రమ ప్రాంగంణంలో పెట్టిన పీవీ సురేష్‌ ఫ్లెక్సీని తొలగించాలని.. సత్యనారాయణ వాగ్వాదానికి దిగారు. ఫ్లెక్సీని తొక్కేశారు. అక్కడే ఉన్న సురేష్... ఆయన అనుచరులు ఘర్షణకు దిగారు.

fight between vishaka west  zone ysrcp leaders
విశాఖలో వైకాపా నాయుకలు మధ్య ఘర్షణ

By

Published : Nov 26, 2020, 11:11 AM IST

విశాఖలో వైకాపా నాయుకల మధ్య ఘర్షణ

విశాఖ పశ్చిమ నియోజకవర్గంలో మాజీ డిప్యూటీ మేయర్‌ దాడి సత్యనారాయణ, 60వ వార్డు వైకాపా అభ్యర్థి పీవి సురేష్‌ మధ్య మరోసారి విభేదాలు భగ్గుమన్నాయి. జీవీఎంసీ పరిధిలోని మరిడిమాంబ కల్యాణ మండపంలో బుధవారం ‘జగనన్న తోడు’ ప్రారంభ కార్యక్రమం ఏర్పాటు చేశారు. అక్కడి గేటు వద్ద పెట్టిన పీవీ సురేష్‌ ఫ్లెక్సీని తొలగించాలని, పక్క వార్డు నాయకుడి ఫ్లెక్సీ ఇక్కడెందుకంటూ దాడి సత్యనారాయణ ఆగ్రహించారు. ఫ్లెక్సీని తొక్కేశారు.

అక్కడే ఉన్న సురేష్‌, ఆయన అనుచరులు వాగ్వాదానికి దిగారు. సత్యనారాయణ అనుచరులు వారితో ఘర్షణ పడ్డారు. అక్కడికి చేరుకున్న పశ్చిమ వైకాపా ఇన్‌ఛార్జి మళ్ల విజయప్రసాద్‌ దృష్టికి విషయాన్ని తీసుకువెళ్లారు. దాడి సత్యనారాయణతోపాటు తన అనుచరులు ఫ్లెక్సీ తొలగించారంటూ పిల్లా లక్ష్మణరావు (సురేష్‌ అనుచరుడు) ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని మల్కాపురం పోలీసులు తెలిపారు.

మూడు రోజుల క్రితం మల్కాపురం వద్ద రహదారిపై ఇద్దరు స్థానిక నేతలు మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఇంతలోనే.. మరోసారి ఇద్దరు నేతలకు గొడవ జరిగింది.

ఇదీ చదవండి:

బలంగా తుపాను ప్రభావం.. కోస్తా, సీమ జిల్లాల్లో భారీ వర్షాలు

ABOUT THE AUTHOR

...view details