విశాఖ జిల్లా చోడవరంలో లాక్డౌన్ సమయంలో ఆదుకున్న వారిని స్థానిక గణేష్ అకాడమీ కోచ్ పుల్లేటి గణేష్, సామాజిక కార్యకర్త సకురు కోటేశ్వరరావు సత్కరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా చోడవరం రేంజి అటవీశాఖ అధికారి రామనరేష్ హజరయ్యారు. సామాజిక సేవ అనేది పవిత్రమైన అంశమని పేర్కొన్నారు. మహమ్మారి కరోనా వైరస్ ఉన్నా అన్నార్తులను ఆదుకునేందుకు ముందుకు వచ్చిన సంస్థలను అభినందించారు. సంస్థలకు జ్ఞాపికలను అందజేశారు.
కరోనా సేవలు అందించిన వారికి సత్కారం - vishaka district
చోడవరంలో లాక్డౌన్ సమయంలో నిరాశ్రుశుయులైన వర్గాలకు ఉచిత సేవలను అందించిన సంస్థలను గణేష్ అకాడమీ కోచ్ పుల్లేటి గణేష్, సామాజిక కార్యకర్త సకురు కోటేశ్వరరావు సత్కరించారు.
కరోనా సేవాలు అందించిన వారికి సత్కారం
ఓ పక్క అన్నార్తులను ఆదుకుంటూ మరొక పక్క సంస్థలను సత్కరించి పలువురికి స్ఫూర్తిగా నిలిచిన గణేష్ అకాడమీ కోచ్ పుల్లేటి గణేష్, సామాజిక కార్యకర్త సకురు కోటేశ్వరరావులను అందరూ కలిసి శాలువా కప్పి, జ్ఞాపికలతో సన్మానించారు. ప్రసాదు, ఏడమ్స్ వెంకటరావు, మధు, కోసర తాతరావు, కృష్ణవేణి, కె.రాంబాబు, ఎం.శ్రీ రామ్మూర్తి పాల్గొన్నారు.
ఇది చదవండిహ్యాండ్ శానిటైజర్ మిషన్ ప్రారంభం...