కన్నకూతురిపై రెండేళ్లుగా అత్యాచారం చేస్తున్న కామాంధుడిపై చర్యలకు రంగం సిద్ధం చేశామని విశాఖ జిల్లా చింతపల్లి ఏఎస్‌పీ సతీష్‌కుమార్ అన్నారు. తనను, తన కుమార్తెను వేధిస్తున్నాడని కామాంధుడి భార్య , గ్రామపెద్దలతో తమకు ఫిర్యాదు చేశారని, ఘటనపై తమకు అనుమానాలు ఉన్నప్పటికీ ముందుగా 354 సెక్షన్ కింద కేసు నమోదు చేసినట్లు ఆయన తెలిపారు. మహిళా కానిస్టేబుల్ సమక్షంలో విచారణ జరపగా కామాంధుడి వ్యవహారం బయటపడిందని, రెండుళ్లుగా చేస్తున్న అఘాయిత్యాన్ని బాధితురాలూ తెలిపిందనీ చెప్పారు. ఈ మేరకు నిందితునిపై అత్యాచారం, మరియు పోక్సో కింద కేసు నమోదు చేసినట్లు ఏఎస్పీ పేర్కొన్నారు. బాధితురాలిని వైద్య పరీక్షలు నిమిత్తం విశాఖ కేజీహెచ్‌కు తరలించినట్లు ఏఎస్పీ తెలిపారు.
'కీచక తండ్రి'పై చర్యలకు రంగం సిద్ధం - daughter
విశాఖ జిల్లాలో ఆలస్యంగా వెలుగుచూసిన అత్యాచార ఘటనపై.. పోలీసులు కఠిన చర్యలకు సిద్ధమయ్యారు. కూతురిపై అఘాయిత్యం చేసిన తండ్రిని అరెస్ట్ చేసేందుకు రంగం సిద్ధం చేసినట్లు ఏఎస్పీ సతీష్ కుమార్ తెలిపారు.
విశాఖ కామాందుడిపై చర్యలకు రంగం సిధ్దం