ఆంధ్రప్రదేశ్

andhra pradesh

పాత సీసాలే.. వేరుశనగ పంటకు రక్షణ..!

By

Published : Feb 22, 2021, 10:11 AM IST

Updated : Feb 22, 2021, 2:09 PM IST

మందు బాబులు తాగి పారేసిన మద్యం సీసాలు, పాత సీసాలే వేరుశనగ పంటకు రక్షణగా నిలిచాయి. రైతులు వినూత్నంగా ఆలోచించి.. పంటలు కాపాడుకునేందుకు ఆ సీసాలను ఉపయోగిస్తున్నారు.

farmers protecting the crop with glass bottles
వేరుశనగ పంటకు సీసాలతో రక్షణ

విశాఖ జిల్లా చీడికాడ మండలం కోనాం, మంచాల పంచాయతీల్లోని పలు గ్రామాల రైతులు వేరుశనగ పంటను సాగు చేస్తున్నారు. ఆ ఊరిలో పొలాలు అటవీ ప్రాంతానికి దగ్గరగా ఉండటంతో అడవి జంతువులు పంటలను నాశనం చేస్తున్నాయి. దీంతో పంటను కాపాడుకునేందుకు రైతులు బీరు సీసాలను ఉపయోగిస్తున్నారు.

పంట రక్షణకు ఏర్పాటు చేసిన పాతసీసాలు

ఖాళీ మద్యం సీసాలను సేకరించి.. చేనులో కర్రలకు వేలాడదీస్తున్నారు. సీసాలతో చిన్న ఇనుప ముక్కను కూడా కట్టారు. అవి గాలికి కదులుతుంటే టిక్... టిక్ అంటూ శబ్దం వస్తుంది. దీంతో అటవీ జంతువులు పంట పొలాల్లోకి రాకుండా ఉంటాయని రైతులు చెబుతున్నారు. ఇలా ఈ ప్రాంతం రైతులు పంటను రక్షించుకుంటున్నారు.

ఇదీ చదవండి:పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కొనసాగుతోన్న అల్పపీడన ద్రోణి

Last Updated : Feb 22, 2021, 2:09 PM IST

ABOUT THE AUTHOR

...view details