విశాఖ జిల్లా సబ్బవరం మండలం ఇరువాడ గ్రామానికి చెందిన అప్పారావు అనే రైతు ఒంటిపై పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. వెంటనే అతన్ని బంధువులు అనకాపల్లి ఏరియా అస్పత్రికి తరలించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం అప్పారావును కేజీహెచ్‌కు సిఫారసు చేశారు. గ్రామంలో తనకు చెందిన 15 సెంట్ల డీ పట్టా భూమిలో పని చేస్తుండగా.. స్థానిక వీఆర్వో, సర్వేయర్ అడ్డుకున్నారని.. అందుకే అప్పారావు బలవన్మరణానికి యత్నించాడని బంధువులు ఆరోపించారు.
పొలం పనులు అడ్డుకున్నారని రైతు ఆత్మహత్యాయత్నం - విశాఖలో రైతు ఆత్మహత్యాయత్నం
విశాఖ జిల్లా సబ్బవరం మండలంలో ఓ రైతు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. డీ-ఫారం పట్టా భూమిలో పనిచేస్తుండగా.. వీఆర్వో, సర్వేయర్ పనులు చేయడానికి వీల్లేదని హెచ్చరించటంతో మనస్తాపం చెంది ఇలా చేశాడని బంధువులు ఆరోపించారు.
వీఆర్వో మందలించాడని....వంటిపై పెట్రోల్ పోసుకున్న రైతు