వైకాపా ఏడాది పాలనలో ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టిందని వైకాపా నేతలు అన్నారు. విశాఖలోని ఆ పార్టీ కార్యాలయంలో మాజీ మంత్రి పసుపులేటి బాలరాజు, మాజీ ఎమ్మెల్యే కుంభా రవిబాబు మీడియాతో మాట్లాడారు. అభివృద్ధిని చూసి తట్టుకోలేని ప్రతిపక్షం కోర్టుల్లో కేసులు దాఖలు చేస్తోందని విమర్శించారు. వైకాపా ప్రభుత్వానికి వ్యతిరేకంగా తెదేపా మహానాడులో చేసిన తీర్మానాలను ఖండించారు. ప్రధాన ప్రతిపక్షంలో ఉన్న తెదేపా మంచి సూచనలు ఇవ్వాలని హితవు పలికారు.
'అభివృద్ధిని చూసి తట్టుకోలేకే కోర్టుల్లో కేసులు' - tdp mahanadu
ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని చూసి ఓర్వలేక తెదేపా అనవసరపు విమర్శలు చేస్తోందని వైకాపా నేత, మాజీ మంత్రి పసుపులేటి బాలరాజు అన్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా మహానాడులో తెదేపా చేసిన తీర్మానాలను నేతలు ఖండించారు.
Ycp_Leaders