రైతులు నష్టపోతుంటే ప్రభుత్వం కళ్ళు మూసుకుని ఉందని తెదేపా సీనియర్ నేత, మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు విమర్శించారు. జగన్ విధానాలతో అన్నదాతలు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి వచ్చిందని దుయ్యబట్టారు. కూరగాయలు దొరకటం లేదని ప్రజలు మొరపెట్టుకుంటుంటే... వాటిని సిద్ధం చేసిన రైతులకు అమ్ముకునే అవకాశం కల్పించటం లేదని మండిపడ్డారు. రైతుల నుంచి నేరుగా కొనే ప్రయత్నం కూడా ప్రభుత్వం చేయట్లేదని ఆక్షేపించారు. వ్యవసాయ, ఉద్యానవన శాఖలు సమన్వయంతో రైతు ఉత్పత్తులు కొనుగోలు చేసి వారిని ఆదుకోవాలని డిమాండ్ చేశారు.
'పంటను ప్రభుత్వమే నేరుగా కొనాలి'
రైతుల పట్ల వైకాపా ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు సరిగా లేదని మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం జగన్ విధానాలతో రైతులు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి వచ్చిందని దుయ్యబట్టారు.
ex minister ayyannapatrudu