ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

వృక్షమా.... నీకు వందనమమ్మా - వందనం అమ్మా

పర్యావరణ పరిరక్షణకు విశాఖ ప్రజలు నడుంబిగించారు. రైల్వే స్టేషన్ రోడ్డులోని 145 ఏళ్ళ మర్రి చెట్టును వేదికగా చేసుకుని 'వృక్షమా నీకు వందనం అమ్మా' అనే పేరుతో పర్యావరణ ఉద్యమానికి శ్రీకారం చుట్టారు. పర్యావరణంపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ప్రజా గాయకులు,పర్యావరణ వేత్తలు ఉద్యమంలో భాగస్వాములయ్యారు.

వృక్షమా నీకు వందనం అమ్మా

By

Published : Aug 28, 2019, 12:07 PM IST

విశాఖలో పర్యావరణ వేత్తలు, ప్రజా గాయకులు ఒక్కటయ్యారు. విశాఖను కాలుష్య కొరల నుంచి బయట పడేయాలంటే చెట్ల పెంపకం ఒక్కటే మార్గమని హితవు పలుకుతున్నారు. గాలి, నీరు, చెట్టు సంరక్షించాలని పిలుపునస్తున్నారు.విశాఖ ఆంధ్ర విశ్వవిద్యాలయ వృక్ష శాస్త్ర నిపుణులు, పర్యావరణ పరిరక్షణ సంస్థలు ఒక ఉద్యమంలా వృక్ష పరిరక్షణకు నడుంబిగించారు.

విశాఖలో రైల్వే స్టేషన్ రోడ్డులోని 145ఏళ్ళ మర్రి చెట్టు వేదికగా చేసుకుని ప్రజా గాయకులు పర్యావరణ పరిరక్షణ కోసం గీతాలతో ఉత్తేజ పరుస్తునారు. అభివృద్ధి పేరిట చెట్లు నరక వద్దని, సునామిల నుంచి కాపాడే మడ అడవులు నాశనం చేయవద్దని పాటల రూపంలో పాడుతున్నారు. విశాఖ లాంటి సుందర నగరాన్ని పర్యావరణ పరంగా కాపాడాలని ప్రజా సంఘాలు, పర్యావరణ నిపుణులు ఉద్యమంలా కార్యక్రమాన్ని చేపట్టారు.
విశాఖలో వివిధ ప్రాంతాల్లో ఈ విధంగా కార్య క్రమాలు నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నట్లు పర్యావరణ వేత్తలు తెలిపారు.

వృక్షమా నీకు వందనం అమ్మా

ABOUT THE AUTHOR

...view details