ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

విశాఖలో నిరాశ్రయులకు సరుకుల పంపిణీ - ఔషధ నియంత్రణ శాఖ ఉప సంచాలకులు గోవిందం

నిరాశ్రయులను ఆదుకోవడంలో చాలా సంస్ధలు, విభాగాలు ఔదార్యాన్ని చాటుతున్నాయి. విశాఖ నగరంలోని నిరాశ్రయ వసతి గృహాల్లోని వారికి అవసరమైన మందులతో పాటు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు ఔషధ నియంత్రణ సంస్థ అధికారులు.

Drug Association Distribution food in Homeless
విశాఖలో నిరాశ్రయులకు నిత్యావసరాల పంపిణీ

By

Published : Apr 19, 2020, 6:48 PM IST

విశాఖలో నిరాశ్రయులను ఆదుకునేందుకు ఔషధ దుకాణాల సంఘం ఆధ్వర్యంలో ఔషధ నియంత్రణ శాఖ ముందుకు వచ్చింది. సరుకుల పంపిణీని శాఖ ఉప సంచాలకులు గోవిందం పరిశీలించారు. పేదలకు వస్తువులను పంపిణీ చేశారు. ప్రతి రోజూ విశాఖ నగరంలో ఉన్న నిరాశ్రయ వసతి గృహాల్లో తాము సాయంత్రం టీ, టిఫిన్, అవసరమైన మందులు, వ్యక్తిగత పరిశుభ్రతకు అవసరమైన వస్తువులను విడతలుగా సరఫరా చేస్తున్నామని మందుల దుకాణాల సంఘం అధ్యక్షుడు శ్రీనివాసరావు చెప్పారు.

ABOUT THE AUTHOR

...view details