తూర్పు కోస్తా రైల్వే డీఆర్ఎం చేతన్ కుమార్ శ్రీవాస్తవ్ విశాఖ రైల్వే స్టేషన్ను సందర్శించారు. వాల్తేరు డివిజన్లో ఈ నెల 29న జీ.ఎం పర్యటన నేపథ్యంలో ఆయన ముందస్తు తనిఖీలు చేపట్టారు. స్టేషన్లో చేపడుతున్న అభివృద్ధి పనులను పరిశీలించారు. జీఎం ప్రారంభించనున్న పలు అభివృద్ధి కార్యక్రమాలపై అధికారులకు సూచనలు చేశారు. క్లాక్ రూమ్, లాంజ్ పరిసర ప్రాంతాల్లో పర్యటించి పరిశీలించారు. ప్రారంభానికి సిద్ధంగా ఉన్ ఏసీ డార్మెటరీ గదుల వివరాలను అడిగి తెలుసుకున్నారు.
విశాఖ రైల్వే స్టేషన్లో తూర్పు కోస్తా రైల్వే డీఆర్ఎం తనిఖీలు - srivastava
విశాఖ జిల్లా వాల్తేరు డివిజన్లో ఈ నెల 29న జీ.ఎం పర్యటన నేపథ్యంలో తూర్పు కోస్తా రైల్వే డిఆర్ఎం చేతన్ కుమార్ శ్రీవాస్తవ్ విశాఖ రైల్వే స్టేషన్లో ముందస్తు తనిఖీలు చేపట్టారు.
తూర్పు కోస్తా రైల్వే డీఆర్ఎం తనిఖీలు