రాష్ట్రంలో అంబేడ్కర్ రాజ్యాంగాన్ని అమలు చేయకుండా వైకాపా ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తుందని జిల్లా ఎస్సీ, ఎస్టీ సెల్ అధ్యక్షుడు పుచ్చా విజయకుమార్ మండిపడ్డారు. వైకాపా ప్రభుత్వం దళితులపై దాడులకు తెగబడుతుందని విశాఖ జిల్లా గాజువాకలోఆయన అన్నారు.కావలిలో ఎన్టీఆర్ విగ్రహాన్ని కూలగొట్టడం అన్యాయమని వ్యాఖ్యానించారు. ఇక బాపట్లలో అంబేడ్కర్ విగ్రహాన్ని తొలగించడం ఆ మహా నేతను అవమానించడమేనని పేర్కొన్నారు. జడ్జ్ రామకృష్ణపై దాడి చేసిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని బర్తరఫ్ చేసి ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చెయ్యాలని ఆయన డిమాండ్ చేశారు.
'వైకాపా దళితులపై దాడులకు తెగబడుతోంది'
ఎస్సీ, ఎస్టీలకు వైకాపా ప్రభుత్వం అన్యాయం చేస్తుందని జిల్లా ఎస్సీ, ఎస్టీ సెల్ అధ్యక్షుడు పుచ్చా విజయకుమార్ అన్నారు. విశాఖ జిల్లా గాజువాకలో ప్రభుత్వం దళితులపై దాడులకు పాల్పడుతుందని ఆరోపించారు. మహనీయుల విగ్రహాలను ధ్వంసం చేయడంపై ఆయన మండిపడ్డారు.
జిల్లా ఎస్సీ, ఎస్టీ సెల్ అధ్యక్షుడు పుచ్చా విజయకుమార్