విశాఖ జిల్లాలో సగం గిరిజన ప్రాంతంలోనే ఉంది. మొత్తం 11 మండలాల్లో విస్తరించిన గిరిజన ప్రాంతం జనాభా పరంగా, పదో వంతు కంటే తక్కువగానే ఉంది. ఇక్కడ గిరిజనులను భూమి హక్కులను పట్టాలుగా ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేసిన కసరత్తు ఒక కొలిక్కి వచ్చింది. అటవీ హక్కుల చట్టంపై జిల్లా స్థాయి కమిటీ సమావేశ మయ్యింది.
అటవీ హక్కుల చట్టంపై జిల్లా స్థాయి కమిటీ సమావేశంలో అటవీ భూములపై వ్యక్తిగత హక్కు పత్రాలను ఇచ్చేందుకు అధికారులు నిర్ణయించారు. అటవీ హక్కుల చట్టం ప్రకారం జిల్లాలో 21, 144 ఎకరాలకు 13, 172 మందికి వ్యక్తిగత హక్కు పత్రాలను ఇవ్వనున్నారు. దరఖాస్తుల పరిశీలన అనంతరం వ్యక్తిగత హక్కు పత్రాలను, సామూహిక హక్కు పత్రాలను అందజేయనున్నారు.