విశాఖ జిల్లా పాడేరులోని పేదలకు.. దాతలు అండగా నిలుస్తున్నారు. కష్ట కాలంలో కొంత ఉపశమనం కలిగిస్తున్నారు. ఆంజనేయులు అనే ఉపాధ్యాయుడు.. తన తల్లి స్ఫూర్తితో పాడేరులో పేదలకు బియ్యం పంపిణీ చేశారు. పాడేరు డీఎస్పీ రాజ్‌కమల్... సంతలోని చిన్న చిన్న వ్యాపారులు, వినియోగదారులకు మాస్కులు అందజేశారు. సమయపాలన పాటించి దుకాణాల వద్ద రద్దీ లేకుండా చూడాలని సూచించారు. సీఐటీయూ ఆధ్వర్యంలో జిల్లా కార్యదర్శి శంకర్రావు, గిరిజన సంఘం రాష్ట్ర కార్యదర్శి అప్పల నర్స స్థానిక కార్యకర్తలతో కలిసి పేదలకు కూరగాయలు పంపిణీ చేశారు.
దాతల సహకారం... పేదలకు ఉపశమనం - పాడేరులో లాక్డౌన్ వార్తలు
లాక్డౌన్ కారణంగా నిత్యావసర సరుకులకు ఇబ్బంది పడుతున్న పేదలకు దాతలు సహాయం చేస్తున్నారు.
Distribution of Essential Goods in paderu