దక్షిణ కోస్తా రైల్వే జోన్ ప్రత్యేక అధికారిగా ధనుంజయులు - ధనుంజయులు
విశాఖ కేంద్రంగా ఏర్పాటయ్యే దక్షిణ కోస్తా రైల్వే జోన్‌కి ప్రత్యేక అధికారిగా ఆర్. ధనుంజయులు నియమితులయ్యారు. 1988 బ్యాచ్‌కి చెందిన ఐఆర్టీఎస్ అధికారి ఈయన. ప్రస్తుతం సికింద్రాబాద్ దక్షిణ మధ్య రైల్వే ప్రధానకార్యాలయంలో సీటీపీఎంగా పనిచేస్తున్నారు. రైల్వే జోన్ ఏర్పాటు చేస్తామని కేంద్రం ప్రకటించిన తర్వాత శ్రీనివాస్‌ను దక్షిణ కోస్తా రైల్వే జోన్ తొలి ప్రత్యేక అధికారిగా నియమించింది. ఇటీవలే ఆయన్ని ఆ స్ధానం నుంచి గుంటూరు డీఆర్‌ఎంగా బదిలీ చేసింది. జోన్‌కి సంబంధించిన ఏర్పాట్లు వేగంగా జరగాల్సి ఉన్నప్పటికి ఎన్నికల కోడ్‌తో అవి నత్తనడకనే సాగాయి. తాజా బదిలీల అనంతరం ధనుంజయులు రాకతో జోన్ ఏర్పాటుకి సంబందించిన కార్యకలాపాలు జోరందుకునే అవకాశం ఉందని రైల్వే వర్గాలు భావిస్తున్నాయి. ధనుంజయులు గతంలో విజయవాడ డిఆర్ఎంగా పనిచేశారు.
దక్షిణ కోస్తా రైల్వే జోన్ ప్రత్యేక అధికారిగా ధనుంజయులు