రెండవ శుక్రవారం సందర్భంగా విశాఖ జిల్లా నర్సీపట్నంలోని ప్రముఖ ఆలయాలు ముస్తాబయ్యాయి. నర్సీపట్నం ఆర్టీసీ కాంప్లెక్స్ ఆవరణలోని కనకదుర్గ ఆలయంలో భక్తులరద్దీ అధికంగా ఉంది. ఉదయం నుంచి మహిళలు దర్శనం కోసం క్యూలైన్ కట్టి నిరీక్షిస్తున్నారు. నర్సీపట్నంతో పాటు పరిసర మండలాల మాకవరపాలెం, నాతవరం, గొలుగొండ, రోలుగుంట, తదితర ప్రాంతాల మహిళలు ఈ ఆలయానికి తరలివచ్చారు. ఎండ ఎక్కువగా ఉండటంతో క్యూలైనులో మహిళలు అవస్థలు ఎదుర్కొంటున్నారు.
కనకదుర్గ ఆలయంలో భక్తులరద్దీ ... - devotees are wating in que line
వరలక్ష్మివ్రతం పర్వదినం కావున ఆలయాలు భక్తలతో రద్దీగా మారాయి. అధికసంఖ్యలో మహిళలు క్యూలైన్లలలో వేచివున్నారు.
devotees are wating in que line at kanakadurga temple in narsipatnam vishakaptnam district.