ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

రేపు ఏకాంతంగా సింహాద్రి అప్పన్న కల్యాణోత్సవం - simhadri temple

విశాఖపట్నంలోని సింహాచలం సింహాద్రి అప్పన్న స్వామి సన్నిధిలో ఈనెల 23న జరగనున్న సింహాద్రి కల్యాణ మహోత్సవాన్ని ఏకాంతంగా జరుపుతున్నట్లు ఆలయాధికారులు తెలిపారు. కొవిడ్ వ్యాప్తి నేపథ్యంలో ఈ మహోత్సవాలని భక్తులకు అనుమతి లేదన్నారు. తీర్థప్రసాదాలు, తలంబ్రాలు పొందాలనుకునే వారికి అన్​లైన్​ ద్వారా సదుపాయం కల్పించినట్లు స్పష్టం చేశారు.

Devotees are not allowed to Simhadri Kalyana Mahotsavam
సింహాద్రి కల్యాణ మహోత్సవం

By

Published : Apr 22, 2021, 11:29 AM IST

కరోనా విజృంభణ నేపథ్యంలో శుక్రవారం విశాఖలోని సింహాద్రి అప్పన్న ఆలయంలో జరగనున్న స్వామి కల్యాణ మహోత్సవంలో భక్తులకు అనుమతి లేదని దేవస్థానం ప్రకటించింది. ఈ క్రమంలో కల్యాణోత్సవాన్ని ఏకాంతంగా నిర్వహిస్తున్నట్లు ఆలయాధికారులు తెలిపారు. ప్రభుత్వం, దేవాదాయ శాఖ కమిషనర్ ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నామని.. భక్తులు సహకరించాలని కోరారు. స్వామివారి కల్యాణ ప్రసాదం, తీర్థప్రసాదాలు, తలంబ్రాలు పొందాలనుకునే భక్తుల కోసం ఆన్​లైన్​ సదుపాయం కల్పించామన్నారు. ఇందుకు రూ.516 చెల్లించి ముందుగా పేరు నమోదు చేసుకుంటే వారి ఇంటికే పంపిస్తామని వివరించారు.

శుక్రవారం అర్థరాత్రిలోగా..

'ఈనెల 23 అర్ధరాత్రిలోగా UPI ID : 9491000635@SBI లేదా ఆన్​లైన్ SBI A/c number : 11257208642, IFSC code : SBIN0009795 కు గానీ భక్తులు డబ్బులను పంపించొచ్చని అధికారులు పేర్కొన్నారు. అనంతరం తమ పేరు, అడ్రస్, ఫోన్ నంబర్​ను 6303800736 కు వాట్సప్ చేయాలన్నారు. ఇతర సమాచారం కోసం ఇదే ఫోన్​ నంబర్​ను సైతం సంప్రదించవచ్చని చెప్పుకొచ్చారు. భక్తులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని శ్రీస్వామివారి కృపకు పాత్రులు కావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నామన్నారు. విరాళాలు కూడా పంపించవచ్చు అని ఆలయ నిర్వాహకులు స్పష్టం చేశారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details