విశాఖ ప్రాంతం సహజత్వానికి నిదర్శనం. ప్లాస్టర్ ఆఫ్ పారిస్కు దూరంగా ఉండాలని ప్రకృతి వనరులతో తయారుచేసిన వినాయకులు కనువిందు చేయబోతున్నాయి. కోల్కతా నుండి తెచ్చిన మట్టితో...నీటిరంగులను వాడుతూ 15ఏళ్ల నుంచి విగ్రహాలు చేస్తున్నారు. వీటిని తయారుచేయడానికి 3 నెలల సమయం పట్టింది. అంతేగాక గంగ మట్టితోపాటు, అలంకరణ సామాగ్రిని సైతం కోల్కతా నుండి దిగుమతి చేసుకున్నారు. కర్రలు, నీటిలో కరిగిపోయే రంగులతో ఈ బొజ్జ గణపయ్యలు వన్నె సంతరించుకున్నాయి.
పర్యావరణ గణపయ్య... పూజలందుకోవయ్య... - natural
సహజత్వమే తోడుగా సహజసిద్ధ రంగులతో లంబోదరులు ఆకట్టుకుంటున్నాడు. చవితి రోజున పూజలందుకునే గణనాథులు రంగురంగుల రూపాలతో భక్తులను అలరిస్తున్నాయి. మట్టి, సహజ రంగులతో బుజ్జి గణపయ్యలు దర్శనమియ్యనున్నాయి. ఈసారి విశాఖలో కళాకారులు పర్యావరణహితంగా కేవలం సహజ సిద్దమైన గణనాధులను తయారు చేశారు. కేవలం గంగ మట్టితోనే రూపుదిద్దుకునే ఈ గణేష్లకి... వాడే రంగులూ నీటిలో తక్కువ సమయంలో కరిగిపోయే సహజ రంగులే కావడం విశేషం..
పర్యావరణహితం..
పర్యావరణానికి హాని తలపెట్టవద్దంటూ పోలీసులు అవగాహన కల్పించటంతో వీటిని తయారు చేస్తున్నామంటున్నారు నిర్వహకులు. కృత్రిమ పదార్థాలు జలచరాలకు హాని చేస్తాయని..వీరు సహజ వనరులతో సిద్ధం చేస్తున్నారు. వీటి ధర రూ. 5 వేల నుంచి 50 వేల వరకు గణనాథులు ధర పలుకుతోంది. ఇప్పటికే బొమ్మల తయారీదారులు దగ్గర ఉన్న బొమ్మలు ముందే బయానా ఇచ్చి సిద్ధం చేసుకున్నారు. పర్యావరణాన్ని కాపాడే దిశగా వీరు విగ్రహాల తయారీని మొదలుపెట్టిన ప్రయత్నం అందరికి ఆదర్శం.
ఇదీచూడండి.ఆ పల్లె... మట్టి వినాయకుడి ఇల్లు