నౌకాదళ దినోత్సవాల్లో భాగంగా విశాఖలోని ఐఎన్ఎస్ డేగలో తూర్పు నౌకాదళం రక్తదాన శిబిరాన్ని నిర్వహించింది. సర్జన్ రియర్ అడ్మిరల్ సీఎస్ నాయుడు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. వివిధ విభాగాలకు చెందిన 145 మంది అధికారులు రక్తదానం చేశారు. అనంతరం ఆ రక్తాన్ని ఎన్టీఆర్ ట్రస్ట్ బ్లడ్ బ్యాంకుకు అందించారు. కరోనా సమయంలో వివిధ అసుపత్రుల్లో చికిత్స పొందుతున్న రోగులకు ఉపయోగిస్తామని తూర్పునౌకాదళం వివరించింది.
ఐఎన్ఎస్ డేగలో రక్షణ దళాల రక్తదాన శిబిరం - విశాఖ జిల్లా తాజా వార్తలు
డిసెంబర్లో జరగనున్న నౌకాదళ దినోత్సవాల్లో భాగంగా అధికారులు ఐఎన్ఎస్ డేగలో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. వివిధ రక్షణ విభాగాలకు చెందిన 145మంది రక్తదానం చేశారు. పలు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న రోగులకు రక్తం అందించనున్నారు.
రక్షణ దళాల రక్తదాన శిభిరం