విశాఖలో కరోనా వ్యాప్తి కొంతమేర నెమ్మదించినా.. కొత్తగా నమోదు అవుతున్న కేసులు సవాలు విసురుతున్నాయి. ఈ వారంలో ఒక్క రోజు మాత్రమే 150 కొత్త కేసులు నమోదు కాగా.. మిగిలిన అన్ని రోజుల్లోనూ 400కు తగ్గలేదు. జిల్లా వ్యాప్తంగా ఇప్పటి వరకు 48 వేల 3 వందల 36 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా.. 4 వేల 2 వందల 85 యాక్టివ్ కేసులు ఉన్నాయి. కరోనా మహమ్మారి కారణంగా ఇప్పటి వరకు 375 మంది ప్రాణాలు వదిలారు. ప్రస్తుతం కొంతమేర కేసులు తగ్గినా.. చలికాలంలో మరింత ఉద్ధృతం అయ్యే ప్రమాదం ఉండటంతో అధికారులు, వైద్యులు అప్రమత్తమయ్యారు.
కరోనా కేసులు తగ్గినా.. అప్రమత్తత అవసరం - వైజాగ్ కరోనా వార్తలు
విశాఖ జిల్లాలో కరోనా బాధితుల సంఖ్య 50 వేలకు చేరువలో ఉంది. ప్రస్తుతం పాజిటివ్ కేసులు గతంతో పోల్చితే తక్కువగా నమోదు అవుతున్నా.. కొత్త కేసులు నమోదు ఆందోళన కలిగిస్తోంది.
విశాఖ కరోనా కేసులు
అన్లాక్ 4 తరువాత తల్లిదండ్రుల అనుమతితో పాఠాశాలలకు వెళ్లవచ్చు అనే అనుమతులు వచ్చినా... పాఠశాలల్లో హాజరు శాతం అంతంత మాత్రంగానే ఉంటుంది. ప్రస్తుతం ప్రజా రవాణా ప్రారంభం కావటంతో... భౌతిక దూరం కనమరుగువుతోంది. దీనివల్ల వైరస్ పంజా విసిరే అవకాశం ఉందని వైద్యులు, అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కరోనా మరణాల రేటు తగ్గటం, రికవరీలు గణనీయంగా పెరగటం వంటి అంశాలు కొంత ఊరటనిస్తున్నాయి.
ఇదీ చదవండి:'సీఎం జగన్ ప్రతిపక్షాలకు పని లేకుండా చేశారు'