తండ్రికి తలకొరివి పెట్టిన కూతురు - daughter
పుత్రుడు పున్నామ నరకం నుంచి తప్పిస్తాడంటారు. అటువంటి కొడుకులేని లోటు తీరుస్తూ కాలం చేసిన తండ్రికి కూతురే తలకొరివి పెట్టింది.
దహన సంస్కారాలు
విశాఖ జిల్లా కశింకోట మండలం తెగడలో హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన సత్తిబాబు అనే వ్యక్తి అకస్మాత్తుగా గుండెపోటుతో మరణించాడు. మృతుడికి ఇద్దరు కుమార్తెలు నూకరత్నం, ధనలక్ష్మి ఉన్నారు. కుమారుడు లేనందున వారిలో పెద్ద కుమార్తె నూకరత్నం... అన్ని తానై తండ్రికి తలకొరివి పెట్టింది. పేదరికంతో అల్లాడుతున్న కుటుంబానికి గ్రామస్థులు సహాయం చేసి... దహన సంస్కారాలు జరిపించారు.