అరకు సోయగాలు ఆస్వాదించడం మాట అటుంచితే.. ఆ మార్గంలో ప్రయాణం... ప్రమాదం జరగకుండా పూర్తి చేయడమే పెద్ద ప్రయాసగా మారింది. ఆర్&బీ అధికారులు ఎటువంటి చర్యలు తీసుకోని ఫలితంగా.. రహదారి ప్రయాణం ప్రమాదకరంగా మారింది.
ఘాట్ రోడ్డులో వెళ్లి రావడమే ఇబ్బందికరం అనుకుంటే.. బండరాళ్లు రహదారిపై విరిగిపడుతుండటం అందరినీ ఆందోళనకు గురి చేస్తోంది. ఇప్పటికైనా ఆర్&బీ అధికారులు స్పందించి ప్రయాణ చోదకుల అవస్థలు తీర్చాలని పలువురు కోరుతున్నారు.