ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

సైబర్ కేటుగాళ్లు..వీళ్లకు కనికరం ఉండదు

కచ్చులూరు పడవ ప్రమాద బాధితులపై సైబర్ నేరగాళ్లు వల పన్నారు. ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబ సభ్యులను ఆసరాగ చేసుకుంటున్నారు. ఫోన్లు చేసి బాధిత కుటుంబానికి ప్రభుత్వం పరిహారం అందజేస్తుందని ఆశ చూపుతున్నారు. ఆపై బ్యాంకు ఖాతాల్లో నగదు జమచేయాలంటూ మోసానికి పాల్పడుతున్నారు.

కచ్చులూరు పడవ ప్రమాద బాధితులపై సైబర్ నేరగాళ్ల వల

By

Published : Sep 24, 2019, 5:37 PM IST

కచ్చులూరు పడవ ప్రమాద బాధితులపై సైబర్ నేరగాళ్ల వల

కచ్చులూరు పడవ ప్రమాదంలో బాధిత కుటుంబాలను సైబర్ కేటుగాళ్లు వదలడం లేదు. ఆప్తులను కోల్పొయామన్నా బాధలో ఉన్న బాధితులకు ఫోన్ చేసి,వేల రూపాయలను దండుకుంటున్నారు.విశాఖపట్నం వేపగుంటకు చెందిన బాధితుడు శంకర్..తన భార్య,కూతురు ఇటీవల బోటు ప్రమాదంలో మరణించారు.సైబర్ నేరగాళ్ల కళ్లు బాధితుడు శంకర్కు,సచివాలయం డిప్యూటీ సెక్రటరీ పేరిట ఫోన్ చేశారు.పడవ ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు ప్రభుత్వ రూ17లక్షల పరిహారం చెల్లిస్తుందంటూ తెలిపారు.ఆ మొత్తం కావాలంటే తాము చెప్పిన బ్యాంకు ఖాతాలో నగదు వెయ్యాలన్నారు.వారి మాటలను నమ్మిన శంకర్,కిరణ్ అనే వ్యక్తి పేరిట రూ7,200జమచేశాడు.తరువాత ఎంతకీ ఫోన్ గాని,పరిహారం రాకపోయేసరికి..మోసానికి గురయ్యినట్లు బాధితుడు శంకర్ గుర్తించాడు.బోటు ప్రమాదంలో భార్య,కూతురిని పోగొట్టుకున్నానని,ఇప్పుడు నేరగాళ్లు తన డబ్బులను కాజేయడం బాధ కలిగిస్తోందని శంకర్ ఆవేదన వ్యక్తం చేశాడు.

ABOUT THE AUTHOR

...view details