ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

CREDAI PROPERTY SHOW: వేల మంది సొంతింటి కల నెరవేర్చిన క్రెడాయ్​ ప్రాపర్టీ షో - TELUGU NEWS

వేల మందికి సొంతింటి కలను నెరవేర్చిన క్రెడాయ్ ప్రాపర్టీ షో విశాఖలో ప్రారంభమైంది. మూడు రోజుల పాటు ప్రాపర్టీ షోను నిర్వహించనున్నారు. వందకు పైగా గృహ నిర్మాణ సంస్థలు ఈ షోలో పాల్గొంటున్నాయి. దేశ విదేశాల్లో వినియోగిస్తున్న ఆధునిక గృహ నిర్మాణ వస్తువులు ఈ ప్రదర్శనలో కొలువుదీరాయి.

credai-property-show-started-in-vishakapatnam
విశాఖలో క్రెడాయ్ ప్రాపర్టీ షో ప్రారంభం

By

Published : Dec 25, 2021, 9:47 AM IST

విశాఖలో క్రెడాయ్ ప్రాపర్టీ షో ప్రారంభం

విశాఖ ఎంవీపీ కాలనీ గాదిరాజు ప్యాలస్ వేదికగా క్రెడాయ్‌ విశాఖ ప్రాపర్టీ షో-2021 ప్రారంభమైంది. ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ, మేయర్ వెంకట హరికుమారి, వీఎంఆర్డీఏ ఛైర్మన్ విజయనిర్మల, స్మార్ట్ సిటీ కార్పొరేషన్ ఛైర్మన్ వెంకటేశ్వరరావు..జ్యోతి ప్రజ్వలన చేసి ప్రాపర్టీషో ప్రారంభించారు. మూడు రోజుల పాటు క్రెడాయి ప్రాపర్టీ షో సాగనుంది. వందకు పైగా స్థిరాస్తి సంస్థల స్టాల్స్ కొలువుదీరాయి.

ఈ క్రెడాయ్ ప్రాపర్టీ షో వినియోగదారులకు మంచి అవకాశం అని స్థిరాస్తి సంస్థల యజమానులు చెబుతున్నారు. ఒకే చోట వందల వెంచర్‌ల సమాచారం చూసి తమకిష్టమైన దాన్ని ఎంపిక చేసుకోవచ్చని అంటున్నారు. ఈ ఏడాది మొదటిసారి.. హోమ్ ఆటోమేషన్ స్టాళ్లు ఏర్పాటయ్యాయి. వినియోగదారులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని వివిధ సంస్థలు విజ్ఞప్తి చేస్తున్నాయి.

వినియోగదారులకు హోమ్ లోన్ అందించేందుకూ..వివిధ సంస్థలు తమ స్టాళ్లు ఏర్పాటు చేశాయి. ఈ ప్రాపర్టీ షో ద్వారా ఇళ్లను కొలుగోలు చేసే వారికి సులువుగా రుణం అందిస్తామని స్టేట్ బాంక్ అధికారులు తెలిపారు. విశాఖ వాసులు ప్రాపర్టీషోకు వచ్చి సొంతింటి కల నిజం చేసుకోవాలని ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ విజ్ఞప్తి చేశారు. విశాఖ.. వేగవంతంగా అభివృద్ధి అవుతున్న నగరమని.. ఇక్కడ స్థిర నివాసం ఆనందదాయకమని నిపుణులు అభిప్రాయపడ్డారు.

ఇదీ చూడండి:

fire accidnet in visakha steel plant: విశాఖ స్టీల్‌ప్లాంట్‌లో అగ్నిప్రమాదం.. రెండు లారీలు దగ్ధం

ABOUT THE AUTHOR

...view details