ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఉల్లి ధరలను అదుపు చేయాలని సీపీఎం డిమాండ్ - విశాఖలో సీపీఎం కార్యకర్తల నిరసన

ఉల్లి ధరలను అదుపు చేయాలని డిమాండ్ చేస్తూ సీపీఎం కార్యకర్తలు విశాఖలో ఆందోళన చేపట్టారు. ప్రభుత్వాలు , కరోనాను ఎదుర్కొనేందుకు వ్యాధినిరోధక శక్తి పెంచుకోవాలని చెప్తూనే... మరోపక్క నిత్యావసర వస్తువుల ధరలు అమాంతం పెరుగుతున్నా పట్టింపు లేకపోవడం సరికాదన్నారు.

CPM leaders protest
ఉల్లి ధరలను అదుపు చేయాలని డిమాండ్ చేసిన సీపీఎం

By

Published : Oct 21, 2020, 3:14 PM IST

ఉల్లి ధరలను తగ్గించాలని డిమాండ్ చేస్తూ సీపీఎం కార్యకర్తలు విశాఖలో ఈ రోజు ఆందోళన చేపట్టారు. కొవిడ్ ను తట్టుకునేందుకు పౌష్టికాహారం తీసుకోవాలని ప్రభుత్వాలు సూచిస్తూనే... మరోవైపు నిత్యావసర వస్తువుల ధరలు అమాంతం పెరుగుతున్నా పట్టింపు లేకుండా వ్యవహరిస్తున్నాయని మండిపడ్డారు.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తీరును వ్యతిరేకిస్తూ అక్కయ్యపాలెం రైతు బజార్ ఎదుట సీపీఎం కార్యకర్తలు నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఉల్లిపాయల ధరలు మిన్నంటాయని... సామాన్యులకు సబ్సిడీ ధరల్లో అందించాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు.

ABOUT THE AUTHOR

...view details