CPI RAMAKRISHNA: ఏపీ రాజధాని అంశంలో వైకాపా మోసాన్ని బయటపెట్టిన మంత్రి ధర్మానకు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అభినందనలు తెలిపారు. అమరావతి రాజధానిని నిర్వీర్యం చేయాలనే కుట్రతోనే జగన్ సర్కార్ మూడు రాజధానుల అంశాన్ని లేవనెత్తిందని విమర్శించారు. విశాఖనే ఏపీ రాజధానిగా ఉంటుందని మంత్రి ధర్మాన ప్రసాదరావు స్పష్టం చేశారన్నారు. ఇప్పటికైనా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి.. మూడు రాజధానుల డ్రామాలు కట్టిపెట్టాలని హితవు పలికారు. విశాఖను రాజధానిగా కోరే ముఖ్యమంత్రి, మంత్రులు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. వైకాపాకు ధైర్యం ఉంటే రాజధాని అంశం రిఫరెండంగా ఎన్నికలకు వెళ్లాలని రామకృష్ణ సవాల్ చేశారు.
ఆ అంశంపై ఎన్నికలకు సిద్ధమా.. వైకాపాకు సీపీఐ నేత రామకృష్ణ సవాల్ - రామకృష్ణ
CPI RAMAKRISHNA ON DHARMANA: మూడు రాజధానుల పేరిట వైకాపా ప్రభుత్వం చేస్తున్న మోసాన్ని మంత్రి ధర్మాన ప్రసాదరావు తన మాటల్లో బయటపెట్టారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అన్నారు. అమరావతిని ధ్వంసం చేసి.. విశాఖను రాజధానిని చేయాలని ప్రభుత్వం చూస్తోందని మెుదటి నుంచి సీపీఐ చెబుతుందని గుర్తు చేశారు.
CPI RAMAKRISHNA ON DHARMANA