విశాఖ స్టీల్ ప్లాంట్‌ను ప్రైవేటీకరణ చేస్తుంటే పవన్ కల్యాణ్ ఎందుకు మాట్లాడం లేదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ప్రశ్నించారు(cpi ramakrishna slams pawan news). విశాఖలో మాట్లాడిన ఆయన.. రైతులను చంపిన భాజపాకి పవన్ ఎలా మద్దతిస్తున్నారని నిలదీశారు. వచ్చే నెల 20 నుంచి సీపీఐ ఆధ్వర్యంలో ప్రజాసమస్యలపై పోరాటానికి సిద్ధమవుతున్నామని చెప్పారు.
రాష్ట్రంలోని ప్రభుత్వ ఆస్తులను తాకట్టు పెట్టడం చాల నీచమైన చర్య అని రామకృష్ణ అభిప్రాయపడ్డారు. జగన్ పాలనలో రాష్ట్రం అన్నివిధాలా దివాళా తీసిందని విమర్శించారు. రాష్ట్ర ప్రజలను జగన్.. దగా చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రెండేళ్ల పాలనలో చేసిన అప్పులపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అప్పుల కోసం ప్రత్యేకంగా కార్పొరేషన్లను ప్రవేశపెట్టిన ఘనత కూడా జగన్‌కే దక్కుతుందని ఎద్దేవా చేశారు. లఖింపుర్ ఘటనపై స్పందించిన ఆయన.. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అజయ్ మిశ్రా కుమారుడు అజిత్ మిశ్రాను ఎందుకు అరెస్ట్ చేయటంలేదని ప్రశ్నించారు. ఈ విషయంలో పోలీసులు ఎందుకు వెనుకంజ వేస్తున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు.